తెలంగాణ ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుంది..

215
Minister Harish Rao Slams Congress
- Advertisement -

మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. రైతుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులకు మద్దతు ధర ఇస్తున్నామని, రైతులకు ఏ రాష్టంలో కూడా ఇవ్వని ఉచిత కరెంటు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు.కరోనాతో ఇబ్బందులు పడుతున్న సమయంలో రైతులకు రైతు రుణమాఫీకి 1200 కోట్లు రిలీజ్ చేశామన్నారు.వ్యవసాయ శాఖ అధికారులు రైతుల అకౌంట్ లోకి జమచేస్తమన్నరు.

కాంగ్రెస్ నాయకులు కెసిఆర్‌పై మాట్లాడుతున్నారు. దేశంలో ఎక్కడికి కైనా వెళ్దాము మన రాష్ట్రము కంటే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. అంతేకాదు కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలు రైతులను నట్టెట్లో ముంచారు. మీకు మా ప్రభుత్వము గురించి విమర్శించే హక్కు లేదు. దేశంలో 1200 వేల కోట్లు రూపాయలు రైతు బంధు ఇంచ్చిన ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అన్నారు.

ఏ రాష్ట్రంలో నైనా ప్రభుత్వం పూర్తిగా పంటను కొన్నారా… తెలంగాణలో రైతులకు గిట్టుబాటు ధర… ఇచ్చాం,ఉచిత కరెంటు ఇచ్చాం. రైతులకు మద్దతు ఇవ్వని వారంటే దేశంలో కాంగ్రెస్ బీజేపీ లే. కనీసం ఉపాధిహామీ వ్యసాయనికి అనుసంధానం చెయ్యమని చెప్తే దాని మీదా స్పందన లేదని మంత్రి హరీష్‌ మండిపడ్డారు.

వేరే రాష్ట్రంలో కొనుగోలు చెయ్యక.. మన రాష్ట్రంలో తక్కువ ధరకు అమ్ముకోవడానికి వస్తున్నారు. కానీ ఇవ్వల దేశంలో అదర్శించే విధంగా మన రాష్ట్రము తయారైంది. పోల్లు విషయంలో రైతులే కిలో తరుగు తీసుకొమ్మని అంటే… దాని మీరే రాదంతం చేస్తున్నారు అని మంత్రి హరీష్‌ రావు విమర్శించారు.

- Advertisement -