సంతన్న మిత్రబృందం.. మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ..

205
buttermilk
- Advertisement -

పూజ్యులు పెద్దలు మన సీఎం కెసిఆర్ మరియు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. మండుటెండలో మన కోసం డ్యూటీ చేస్తున్న పోలీసన్నలకు ఏదో ఒక చిన్న సేవ చెయ్యాలనుకొని ఎంపీ సంతోష్ కుమార్ మిత్రబృందం హర్షవర్ధన్, ఎన్‌ఆర్‌ఐ మిత్రులు రాధేశ్, ఉదయగిరి, ఇతర మిత్రుల సహకారంతో గత 12 రోజుల క్రితం నుండి మజ్జిగ ప్యాకెట్ల పంపిణి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటివరకు 43 వేల ప్యాకెట్లు అందించారు. శ్వేతా బట్టర్ మిల్క్ వారి పాత్ర మర్చిపోలోనేది. వారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వంచ్చ్చందంగా పాల్గొంటూ అద్భుతమైన మజ్జిగకును అందిస్తున్నారు.

ఇప్పుడు ప్రపంచం అంతటా కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతున్న సమయం, మనల్ని ఆర్థికంగా, మానసికంగా ఎంత ఒత్తిడికి గురి చేస్తున్న వేళా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఇప్పుడు ఎవ్వరి కష్టాలు వారివే.. కానీ ఇప్పుడు ఈ మహమ్మారి మనల్ని ఇంకెన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో తెలియదు,మనమందరం ఒకరికోసం ఒకరం నిలబడి సహాయ సహకారాలు అందించుకుంటూ కరోనాపై ఈ యుద్దాన్ని జయించాలి.

buttermilk

మనందరికీ తెలుసు నిరంతరంగా దీర్ఘకాలం సేవ చెయ్యటం ఎక్కువ మందికి సాధ్యం కాదు.. కానీ పది మంది కలిస్తే అది సాధ్యమవుతుంది అని భావించి ఇలాంటి కష్ట సమయంలో ఇతరులకు ఎంతో కొంత సహాయం చెయ్యాలనే సంకల్పం ఉన్న ఒకే ఆలోచన ఉన్న మిత్రులందరం కలిసి కైండ్‌ హార్ట్స్‌ అనే వాట్సాప్ గ్రూప్‌ను ప్రారంభించారు.. ఈ గ్రూప్ ద్వారా మండుటెండలో పనిచేసే పోలీస్ బృందానికి సేవ చేయడం ఆంద్రుష్టంగా భావిస్తున్నామని ఫౌండర్ హర్షవర్ధన్ తెలిపారు.

ఈ సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఆపదలో అవసరాన్ని, బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు. ఆలాంటి స్నేహితులు ఉండండం నా అదృష్టం, నాకు చాలా ఆనందాన్నిస్తుంది అని, కైండ్‌ హార్ట్స్‌ మిత్రబృందాన్ని ప్రత్యేకంగా అబినందించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరారు.

- Advertisement -