బీజేపీది రాజకీయ పైశాచికత్వం: క్రిశాంక్

532
krishank
- Advertisement -

కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా రాజకీయాలు చేయడం బీజేపీ రాజకీయ పైశాచికత్వానికి నిదర్శనమని మండిపడ్డారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంక్. తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మెప్పును జీర్ణించుకోలేక బురదజల్లే ప్రయత్నాలు , రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్,బీజేపీ తీరును తప్పుబట్టారు.

ఒకవైపు వైద్యులు కరోనాతో పోరాడి సేవలు అందిస్తుంటే ,కొందరు దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన డాక్టర్ సంతోష్ ,డాక్టర్ వేద ప్రకాష్ వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ , బిజెపి కి అనుబంధంగా ఉన్న సక్ష్యం సేవ అనే నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న సంఘంలో జాతీయ సహయ కార్యదర్శి, సభ్యులని ఆరోపించారు .

ఇదే సంఘంలో వీరితో పాటు సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి మల్లిక నడ్డా కూడా ప్రధాన పదవి లో ఉన్నారని చెప్పారు. డాక్టర్ల బృందం సంఘం కేంద్ర బృందానికి ఫిర్యాదు చేసింది అనే బదులు బీజేపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు అంటే స్పష్టంగా ఉంటుందని మండిపడ్డారు క్రిశాంక్. వైద్యుల ముసుగులో రాజకీయం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదని హితవు పలికారు.

- Advertisement -