- Advertisement -
పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తమన్నా రిలేషన్ షిప్‌లో ఉందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుకార్లకు పుల్ స్టాప్ పెట్టింది మిల్కీ బ్యూలీ తమన్నా.
గతంలో దుబాయ్‌లో ఓ బంగారం షాపు ప్రారంభోత్సవానికి పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో కలిసి హాజరైంది తమన్నా. ఇప్పుడు ఆ ఫోటోలను షేర్ చేస్తూ..తమన్నా …పాక్ క్రికెటర్‌తో రిలేషన్ షిప్‌లో ఉందని న్యూస్‌ను వైరల్ చేశారు.
దీంతో ఆదిలోనే పుకార్లకు పుల్ స్టాప్ పెట్టింది తమన్నా. తనకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవని…అవన్ని పుకార్లేనని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు తమన్నా. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా నటిస్తున్న సీటిమార్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
- Advertisement -