- Advertisement -
సకాలంలో రక్తం దొరక్క ఆపదలో ఉన్న ఎంతోమంది చనిపోతున్నారని తెలిపారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అలాంటి వారికి ప్రాణదానం చేసేందుకు యువతతో పాటు ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలని కోరారు.
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడ డివిజన్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హాజరైయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కలిసి రక్తదానం చేసిన వారిని అభినందించారు.
- Advertisement -