రంగనాయక సాగర్ 3వ పంపుసెట్ ప్రారంభం..

430
harishrao
- Advertisement -

సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ టన్నెల్ లో గురువారం సాయంత్రం మూడవ పంపు సెట్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. మరో రెండు రోజుల్లో రంగనాయకసాగర్ రిజర్వాయర్ ఎడమ, కుడి కాలువల ద్వారా దాదాపు 200 చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్ లు నింపుతామని చెప్పారు.

నిబంధనల ప్రకారం రిజర్వాయర్ లో ప్రస్తుతం 1.5 టీఎంసీల నీళ్లు మాత్రమే నింపుతామని… రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 3 టీఎంసీలు నిండి, రిజర్వాయర్ కాలువల పనులన్నీ పూర్తి అయితే 500 చెరువుల్లో నీరు నింపడంతో పాటు, రైతుల భూములకు నీళ్లు నేరుగా అందిస్తాం అన్నారు.

మల్లన్నసాగర్ సర్జిపూల్ కు నీళ్లు తరలించి బైపాస్ కాలువ ద్వారా గజ్వెల్ నియోజకవర్గంలోని 15 టీఎంసీల సామర్థ్యము గల కొండపోచమ్మ సాగర్ కు నీళ్లు పింపింగ్ ద్వారా రిజర్వాయర్ నింపుతామని చెప్పారు.

- Advertisement -