రిషి కపూర్ ఇకలేరు..

273
Rishi-Kapoor
- Advertisement -

బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ ఇకలేరు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 67 ఏళ్లు.

1970లలో సెన్సేషనల్ హిట్ చిత్రం బాబీతో హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన రిషీ కపూర్ వయసు 67 సంవత్సరాలు. లెజెండరీ హీరో, డైరెక్టర్ రాజ్ కపూర్ రెండవ కుమారుడు. రిషీ నిన్నామొన్నటి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

2018లో రిషీకి క్యాన్సర్ బయటపడింది. అప్పటి నుంచి ఎక్కువ సమయం న్యూయార్క్‌లోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు. యువహీరో రణబీర్ కపూర్ రిషీ కుమారుడే. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

- Advertisement -