రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తన కార్యాలయం నుండి వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా చేయటం ఇప్పటికే జరిగినదన్నారు. కరోనా మహమ్మారి వల్ల నేడు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో వైన్ షాపులు మరియు మద్యపాన షాపుల బంద్ సందర్భంగా రాష్ట్రంలో మద్యం వినియోగదారులు కోందరు గుడుంబా వైపు మళ్లే అవకాశం వున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు గుడుంబా నిర్మూలనకు పకడ్బందిగా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు దిశానిర్థేశం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ జరుగుతున్న ఈ సమయంలో అదిలాబాద్, వరంగల్-రూరల్, మహబుబాబాద్, భూపాల పల్లి, కొల్లాపూర్, అచ్చంపేట , కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం మరియు నాగర్ కర్నూల్ జిల్లాలలో గుడుంబా తయారిపై దృష్టి సారించారని వచ్చిన సమాచారంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. గుడుంబా తయారీదారులపై ఉక్కుపాదం మోపాలని మంత్రి అధికారులకు అదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ల లలో గుడుంబా తయారీ మరియు అమ్మకందారుల మీద 1922 కేసులను పేట్టి 8091 లీటర్ల గుడుంబా ను స్వాదీనం చేసుకోవడం జరిగిందని మంత్రి కి నివేదించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యము అమ్మేవారిపై 743 కేసులు పెట్టి 777 మందిని అరెస్టు చేయ్యడం జరిగిందని మంత్రి కి విడియో కాన్పరెన్సు లో వివరించారు. 6,223 లీటర్ల మద్యము, 4525 లీటర్ల బీరును సీజ్ చేయ్యడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే మద్యము సరఫర చేసిన 21 మంది పై కేసులు నమోదు చేసి 212 లీటర్ల మద్యం 22 లీటర్ల బీరు స్వాదీనం చేసుకోవడం జరిగింది. లాక్ డౌన్ సందర్భంగా 45 మంది లైసెన్సు కండిషన్ వ్యతిరేకముగా మద్యము అమ్మకాలు చేసిన వారి దుకాణాల మీద కేసులు నమోదు చేసి 80 మందిని అరెేస్టు చేయ్యడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులకు మరియు సిబ్బందికి తెలంగాణ రాష్ట్రంలో ఏ మారు మూల ప్రాంతములో కూడా గుడంబా తయారు కాకుండా పకడ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. గుడుంబా తయారు దారులపై పి డి యాక్టు క్రింద కేసులను నమోదు చేయాలని వీడియో కాన్పరెన్సు లో నిర్థేశాలు జారి చేసారు.డిప్యూటి కమీషనర్లు,ఎక్సైజ్ సూపరిండెంటెంట్ లు,పోలిస్ మరియు తహిసిల్థార్లు,రెవిన్యూ ఇన్ స్పెక్టర్లతో కలసి తాండాలలో తనిఖీలు నిర్వహించి గుడుంబా తయారిని కట్టడి చేయాలని మంత్రి అదేశించారు.
గతంలో గుడుంబా తయారు చేసిన వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించి, పునరావాసం కూడా అందించటం జరిగిందన్నారు. అలాగే పునరావసం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 6299 మందికి సుమారు 126 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ సహయం అందించారు. ప్రస్తుత లాక్ డౌన్ లో గుడుంబా తయారిదారులను , బెల్లం అమ్మకం దారులను గుర్తించి వారిపై చట్టరీత్య కఠీన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను అదేశించారు. అదే విధంగా ఎక్కడైనా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ కు చెందిన క్రింది స్థాయి సిబ్బంది నుండి ఎక్సైజ్ సూపరిండెంటెడ్ స్థాయి వరకు ప్రభుత్వం నిర్థేశించిన విధులలో అలసత్వం ప్రధర్శిస్తే ఆ అధికారులపై తగిన విధంగా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే సస్పెండ్ చేయ్యడం కూడా జరుగుతుందని మంత్రి హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్థేశించిన విధంగా లాక్ డౌన్ నిబందనలకు విరుద్దంగా వ్వవహరించినా, ప్రభుత్వ లక్ష్యానికి శాఖ గౌరవాన్ని కాపాడేవిధంగా అధికారులందరూ పూర్తి సమన్వంతో పనిచేసి గుడుంబా నియంత్రణ చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను అదేశించారు. మద్యపానము సంబందించి ఆయా ప్రాంతాల నుండి ఏలాంటి వార్తలు వచ్చినచో ఆ ప్రాంత అధికారి మీద తీవ్రమైన చర్య తీసుకోనబడుతుందని మంత్రి అధికారులకు హెచ్చరించారు. అబ్కారి శాఖ జిల్లా ఉన్నతాధికారులు వారి సిబ్బంది తో ప్రతిరోజు సమీక్షలు నిర్వహించాలని, వాటి నివేదికలను మంత్రి గారి కార్యాలయం కు మరియు అబ్కారి శాఖ డైరెక్టర్ కు నివేదించాలని అదేశించారు.
ఈ వీడియో కాన్పరెన్సులో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అదనపు కమీషనర్ అజయ్ రావు, రంగారెడ్డి మరియు మహబుబ్ నగర్ డిప్యూటి కమీషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి,టీఎస్‌బీసీఎల్ ఎండీ సంతోష్‌రెడ్డి, సహాయ కమీషనర్ హరికిషన్ తో పాటు వివిధ జిల్లాల ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ లు వీడియో కాన్పరెన్సు లో పాల్గోన్నారు.