కేంద్ర మంత్రి పియుష్ గోయెల్ కార్యాలయం ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ నుండి కేరళలోని పయ్యనుర్, వెస్ట్ హిల్స్ కు సరిపడా నిత్యవసర వస్తువులు, బియ్యంను రవాణా చేస్తున్నారు. ఇందులో భాగంగా సామాజిక దూరం, పరిశుభ్రత నియమాలను రైల్వే సిబ్బంది పాటిస్తున్నారు అని పియుష్ గోయెల్ కార్యాలయం ట్వీట్ చేసింది. అది చూసిన మంత్రి కేటీర్ ఆ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ.. కామెంట్స్ చేశారు.
ఇదే మహబూబ్ నగర్ జిల్లా కొన్ని సంవత్సరాల క్రితం దేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో ఒకటని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మహబూబ్ నగర్ మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రం కోసం అద్భుతమైన ప్రణాళిక రూపొందించినందుకు గర్వంగా ఉంది. తెలంగాణ ఇప్పుడు చాలా రాష్ట్రాలకు ధాన్యాగారంగా మారింది అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో తెలిపారు.
This is the same Mahbubnagar which was one of the most backward districts in the country a few years ago
Proud that #Telangana CM KCR Garu has scripted a fabulous turnaround 👍 for not just Mahbubnagar but entire state
Telangana has now become granary for many states https://t.co/ybnuoPxDD9
— KTR (@KTRTRS) April 28, 2020