రైతులకు ఇబ్బంది కలిగించొద్దు: నిరంజన్ రెడ్డి

304
Niranjan reddy
- Advertisement -

అనధికారికంగా మార్కెట్‌కు మామిడి రాక మొదలయిందని…రైతులకు ఇబ్బంది కలిగించొద్దని సూచించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి కోహెడ్ మార్కెట్ పనులను పరిశీలించిన నిరంజన్ రెడ్డి వినియోగానికి కొహెడ మార్కెట్ సిద్దంగా ఉందని సంపూర్ణస్థాయి వినియోగంలోకి తెచ్చి అధికారికంగా మూడు రోజులలో ప్రారంభిస్తాం అని తెలిపారు.

కరోనా నేపథ్యంలో కోహెడ యుద్దప్రాతిపదికన సిద్దంచేస్తున్నామని.. రోజుకు 600 వాహనాలు వస్తున్నాయని తెలిపారు. ఇది మరింత పెరుగుతుంది…- రెండు భారీ షెడ్లు సిద్దమయ్యాయి .. మరో షెడ్ నిర్మిస్తాం .. రూ.65 లక్షలతో 1.26 లక్షల చదరపు అడుగుల షెడ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

తాగునీటి కోసం 20 రెండువేల లీటర్ల ట్యాంకులు, ఔటర్ నుండి మార్కెట్ వరకు వెంటనే లైటింగ్ సిద్దం చేయాలన్నారు. రైతులు, ఏజెంట్లు, సహాయకుల కోసం క్యాంటిన్ ఏర్పాటు చేశామని మార్కెట్ ఏజెంట్లు, సహాయకులకు పోలీసులతో ఇబ్బందులు లేకుండా గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు.

తెలంగాణలో 4 లక్షల ఎకరాలలో మామిడి సాగయిందని.. జగిత్యాల మామిడి ముంబయికి వెళ్తుంది .. మిగిలిన మామిడి అంతా కొహెడకే వస్తుందన్నారు. – గడ్డిఅన్నారం మార్కెట్ సరిపోదని ముందస్తు ప్రణాళికతో కోహెడలో ఈ ఏడాది మామిడి మార్కెట్ సిద్దం చేశాం అని తెలిపారు. మార్కెట్లో సీసీ కెమెరాలు, ప్రథమ చికిత్స కేంద్రం, అగ్నిమాపక కేంద్రం, పార్కింగ్ తదితర సౌకర్యాలన్నీ సిద్దమయ్యాయి.. వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి ఉచితంగా మాస్క్ లు సరఫరా .. రైతులు, ఏజెంట్లు సామాజిక దూరం పాటించాలన్నారు.

- Advertisement -