అభివృద్ధి పథంలో తెలంగాణ : మంత్రి మల్లారెడ్డి

289
minister malla reddy
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందన్నారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోయిన్ పల్లి లోని పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గత 20 సంవత్సరాల నుండి పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నారు. ఉద్యమకాలంలో 13 సంవత్సరాల పాటు ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన నాయకుడిగా చరిత్రలో నిలిచారు.

దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని గత ఆరు సంవత్సరాలుగా నెం.1 స్థానంలో నిలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిరుపేదలకు నిత్యవసర సరుకులను అందజేయడం జరిగిందన్నారు.

- Advertisement -