టిఆర్యస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ స్పూర్తితో, మంత్రి కేటీఆర్ ఆదేశమేరకు ఇటీవల యూకే వచ్చి కరోనా వల్ల ఆర్ధిక ఇబ్బందులు పడ్తున్న ప్రవాస విద్యార్థులకు సామాజిక దూరాన్ని పాటిస్తూ, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడానికి రూపొందించిన ‘కేసీఆర్ కూపన్స్ ‘ కార్యక్రమాన్ని నేడు హైదరాబాద్లో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూపన్ను ఆవిష్కరించి ప్రారంభించారు.
నాటి ఎన్నారై తెరాస ఆవిర్భావం నుండి నేటి వరకు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ నేడు ‘కేసీఆర్ కూపన్స్ ‘ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు. ఇతర వివరాల కోసం యూకేలో నివసిస్తున్న ఎన్నారై విద్యార్థులు nritrs@gmail.com ద్వార ఎన్నారై తెరాస యూకే కార్యవర్గాన్ని సంప్రదించవచ్చు.