ప్రస్తుతం టాలీవుడ్ లో ‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ట్రెండింగ్ లో ఉంది.సెలెబ్రిటీస్ తమ ఇండ్లలోనే ఉంటూ ఇంట్లో వారికి సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు, అందులో భాగంగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ హీరో విజయ్ దేవరకొండకు ‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ను విసిరారు. అందుకు విజయ్ దేవరకొండ స్పందిస్తూ… “నన్ను మా అమ్మ పనులు చెయ్యనివ్వట్లేదు సార్, అయినా సరే మీకోసం ఈ లాక్ డౌన్ సమయంలో ఒక వీడియో చేస్తాను” అన్నారు.
అందులో భాగంగా విజయ్ దేవరకొండ తన స్టైల్లో ఓ డిఫరెంట్ గా ఈ ఛాలెంజ్ ను కంప్లీట్ చేశాడు. నిద్ర లేచి, తన పనులు తానే చేసుకుంటూ, వాటర్ బాటిల్స్ ను నింపుతూ, మ్యాంగో ఐస్ చేసి తన పేరెంట్స్ కు ఇచ్చాడు. ‘‘ది రీయల్ మేన్’’ అంటూ తన తండ్రిని వీడియోలో చూపించాడు. సరదాగా వీడియో గేమ్ కూడా ఆడాడు. అంతే కాదు.ఈ లాక్ డౌన్ లో ఏమేం చేయాలో ఫన్నీ గా టిప్స్ అందించాడు.
విజయ్ దేవరకొండ చేసిన ఈ వీడియో కొత్తగా ఉంది, ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించమే కాకుండా సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.ఈ వీడియోను విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రూపొందించటం విశేషం.
విజయ్ ఈ వీడియో పోస్ట్ చేసిన తరువాత కొరటాల శివ స్పందిస్తూ “ఇలానే మంచి పనులు చేస్తూ మీ అమ్మతో నువ్వు మెప్పు పొందాలని కోరుకుంటున్నా” అన్నారు.ఇక మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు
రౌడీ స్టార్.