పోస్టాఫీస్‌ ద్వారా రూ.1500 అందజేత…

274
cm kcr
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన నగదు రూ. 1500/- రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే బ్యాంక్ అకౌంటుకు ఆధార కార్డు అనుసందానం లేనివారికి తపాలా కార్యాలయాల ద్వారా తీసుకొనే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఎక్కువ మంది ఒకే దగ్గర గుమీకూడకుండా వుండేలా తగు జాగ్రతలు తీసుకోవాలని సూచించడమైనది.

మొత్తం 5.21 లక్షల రేషన్ కార్డు లబ్ధిదారులకు నగదు రూ. 1500/- పంపిణీ పోస్టాఫీసుల ద్వారా చెల్లించడానికి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు 52000 లబ్ధిదారులకు నగదు చెల్లించారు. ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మినహా మిగితా జిల్లాల లబ్ధిదారులు నిర్ణయించబడిన తపాలా కార్యాలయాల నుండి నగదు తీసుకోవచ్చు.

GHMC, కరీంనగర్ మరియు వరంగల్ కార్పొరేషన్ల పరిదిలో నిర్ణయించబడిన తపాలా కార్యాలయాల నుండి రాష్ట్రం లోని ఏ జిల్లాకు చెందిన లబ్ధిదారులైన నగదు తీసుకోవచ్చు. GHMC పరిదిలో 24 తపాలా కార్యాలయాలు చెల్లింపులు తీసుకోవడానికి నియమించగా లబ్దిదారుల జాబిత రేషన్ షాపులలో అందుబాటులో ఉండనుంది.

లబ్ధిదారుల జాబితాలో పేరు గల వ్యక్తి మాత్రమే నగదు పొందుటకు అర్హుడు , ఆమె / అతను యొక్క ఆధార్ మరియు రేషన్ కార్డు నంబర్ నగదు ఉపసంహరణకు అవసరం.

- Advertisement -