- Advertisement -
దేశవ్యాప్తంగా రంజాన్ మాసం ప్రారంభమైంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ముస్లి సోదరులంతా ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు జరుపుకుంటున్నారు.
సామూహిక ప్రార్థనలు జరిపే వీలులేకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో అంతా స్వచ్ఛందంగా ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్తే కరోనా వ్యాప్తికి కారకులం అవుతామని, అందుకే కుటుంబంతో కలిసి ఇంట్లోనే ప్రార్థనలు చేస్తున్నామని మతపెద్దలు చెబుతున్నారు. ఇళ్లలోనే ఉండి కరోనాను ఓడించాలని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -