రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం- మంత్రి ఈటెల

206
etela
- Advertisement -

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,డిజిపి మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి సూర్యాపేట,గద్వాల,వికారాబాద్ జిల్లాల్లో పర్యటించి అక్కడి సమాచారాన్ని సిఎం కి అందిచారు. దానిపై రాత్రి 12 గంటలవరకు సిఎం సమీక్ష నిర్వహించి పలు సూచనలు సలహాలు ఇచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.వాటిని అమలుచేస్తున్నామన్నారు.దీనితో పాటుగా వరి,మక్కల కొనుగోళ్లపై కూడా సిఎం గంట గంటకి సమీక్ష నిర్వహిస్తున్నారు.మిల్లర్లకు రైతులకు ఘర్షణ లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని మంత్రి అన్నారు.

ఈ రోజు కోటిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కోవిడ్ హాస్పిటల్స్ పనితీరుపై చర్చించాము. గాంధీ హాస్పిటల్ ను పూర్తిస్థాయి కోవిడ్ హాస్పిటల్ గా ప్రకటించాము. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వ్యక్తులందరికీ ఇక్కడే చికిత్స అందిస్తున్నాం. కరోనా పాజిటివ్ వ్యక్తుల అడ్మిషన్, ట్రీట్మెంట్, టెస్టులు,డిశ్చార్జ్ ల పై సమీక్ష నిర్వహించడం జరిగింది అని తెలిపారు. గాంధీని మొత్తం 6 యూనిట్స్ గా విభజించాలని ప్రతి యూనిట్ కి ఒక ప్రొఫెసర్ ను ఇంచార్జ్ గా నియమించాలని సూచన. అన్నీ యూనిట్ లలో సమానంగా పేషంట్స్ ఉండేలా చూడాలని సూపరింటెండెంట్ డాక్టర్ రాజరావ్ కి ఆదేశాలు జారీ చేశాము. డెత్ రేట్ తగ్గించడానికి ఏం చేయాలి అనే అంశంపై చర్చించాము.

ప్రస్తుతం దేశంలో డెత్ రేట్ 3.18% ఉంటే తెలంగాణలో 2.6% ఉంది, రికవరీ రేట్ దేశంలో 19.9% ఉంటే, తెలంగాణలో 22 % ఉంది. మనదగ్గర ఉన్న 9 లాబొరేటరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ప్రతి రోజు 1540 టెస్ట్స్ లు చేస్తున్నాం. పీపీయి కిట్స్ 4 లక్షలు, నాలుగున్నర లక్షల N-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి. హెల్త్ వర్కర్స్ అందరికీ రెండు డోసులు HCQ టాబ్లెట్స్ అందించాం. లాక్ డౌన్ నుండి ఇప్పటివరకు 37,603 డెలివరీలు చేశామని మంత్రి వివరించారు. బ్లడ్ లేదని పిలుపు ఇస్తే అవసరానికి మించి రక్తం అందింది అని తెలిపారు.

గచ్చిబౌలీ ఆసుపత్రి సిద్దంగా ఉంది, గాంధీ నిండిన తరువాత పషెంట్స్ ని ఇక్కడికి పంపిస్తాం. శాశ్వత ప్రాతిపదికన నీళ్ళు అందించడానికి సిఎం గారు నిధులు కేటాయించారు అని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టాయి. కేవలం కంటేన్మెంట్ ప్రాంతాల్లో మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ రోజు 27 కేసులు నమోదు కాగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 970 కి చేరుకుంది. ఒకరు చనిపోవడం తో ఇప్పటి వరకు చనిపోయినవారు 25 మంది. 58 మంది కొలుకొని ఈ రోజు డిశ్చార్జ్ అవ్వగా మొత్తం 252 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 693 మంది గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు.

ఈ రోజు 27 పాజిటివ్ కేసుల్లో.. GHMC పరిదిలో 13 మందికి,జోగుళాంబ గద్వాల జిల్లాలో 10, జనగామ,కొమరంభీం,మేడ్చల్,రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. దేశంలో లాక్ డౌన్ కి మినహాయింపులు ఇవ్వాలని భావిస్తున్నా తెలంగాణ లో మాత్రం పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామన్నరు. రాపిడ్ టెస్ట్స్ ను మొదటినుండి మనం చేయడంలేదు ఇప్పుడు కేంద్రం కూడా రాపిడ్ టెస్ట్ లు చేయవద్దు అన్నదని సమాచారం. ప్రస్తుతానికి అయితే వాటి అవసరం మనకు లేదు రావద్దని కూడా కోరుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు.ప్లాస్మా థెరపీకి కూడా త్వరలో అనుమతి వస్తుంది అని ఆశిస్తున్నామని మంత్రి తెలిపారు.

- Advertisement -