డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో నితిన్ భీష్మ..!

412
bheeshma
- Advertisement -

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం భీష్మ‌. సేంద్రీయ వ్యవసాయం అనే కాన్సెప్ట్‌కు ప్రేమ కథను జోడించి కామెడీ ఎంటర్ టైనర్‌గా సినిమాను తెరకెక్కించారు. నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ మూవీ బాక్సఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తాజగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అందించారు నితిన్.

కరోనా కారణంగా సినిమా థియేటర్లు బంద్ అయ్యాయి. లాక్ డౌన్ కారణంగా ప్రజలు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో సినిమాను థియేటర్ లో చూడలేకపోయామనే వారికి గుడ్ న్యూస్. డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈనెల 25 వ తేదీన నెట్ ఫ్లిక్స్ , సన్ నెక్స్ట్ లో రిలీజ్ చేయనున్నారు. థియేటర్లో మిస్సైన వ్యక్తులు హ్యాపీగా స్ట్రీమింగ్ లో సినిమాలు చూసుకొని ఎంజాయ్ చెయ్యొచ్చు.

- Advertisement -