- Advertisement -
ఈ నెల 24న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్రమోదీ. అనంతరం దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలతో సంభాషించనున్నారు. ఈ సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నారు.
గ్రామ పంచాయతీలకు వారి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను తయారు చేసి అమలు చేయడానికి సమన్వయంగా పనిచేస్తుంది ఈ యాప్. గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర ఆస్తి ధ్రువీకరణ పరిష్కారానికి స్వమిత్వ పథకాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది మెరుగైన పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీలకు కేంద్రప్రభుత్వం అవార్డులు అందిస్తోంది.నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కర్, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డులను ఈ సందర్భంగా ప్రకటిస్తారు.
- Advertisement -