బాబూ బాగున్నావా…పసిబాబుతో ఎర్రబెల్లి

284
errabelli
- Advertisement -

మీ మంత్రి ఎవరు? నేనెవ‌రో తెలుసా? నేనే మీ మంత్రిని… అంతా బాగేనా? ప‌నులు ఎట్ల జ‌రుగుతున్న‌యి? కాలువ ప‌ని చేస్తున్న‌రా? మ‌ంచి ప‌నే పెట్టుకున్న‌రు. భ‌విష్య‌త్తులో ఉప‌యోగ ప‌డే ప‌నులే పెట్టుకోండి. ఇంకాస్త దూరం పాటించండి. క‌రోనా ఉంది జెర జాగ్ర‌త్త‌. లాక్ డౌన్ ని పాటిద్దాం. సిఎం కెసిఆర్ చెప్పిన‌ట్లు చేద్దాం. క‌రోనా పోయేదాకా జాగ్ర‌త్తగా ఉందాం.* అని *రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు* అన్నారు. మంత్రి ఉపాధి హామీ కూలీల‌తో మ‌మేక‌మైన తీరుది.

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో విస్త‌రించి ఉన్న త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం, నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల పంపిణీ వంట ప‌లు కార్య‌క్రమాల్లో పాల్గొన‌డానికి వెళుతున్న మంత్రి దారిలో మ‌హ‌బూబాబాద్ జిల్లా పెద్ద వంగ‌ర మండ‌లం కిష్టు తండాలో కాలువ శుభ్రం చేసే ప‌నులు జ‌రుగుతుండ‌గా చూశారు. వెంట‌నే అక్క‌డ ఆగారు. నేరుగా పొలాల గ‌ట్ల మీద నుంచి న‌డుస్తూ, కాలు వ‌ద్ద‌కు చేరుకున్నారు. కాలువ ప‌క్క నుంచే నడిచి… నేరుగా కూలీల వ‌ద్ద‌కు చేరారు. అక్క‌డ జ‌రుగుతున్న ప‌నులు ఉపాధి హామీ ప‌నుల‌ని తెలుసుకున్నారు. ఇక అంతే, నేరుగా కూలీల‌తో మాట్లాడ‌టం మొద‌లు పెట్టారు.

నేను ఎవ‌రో తెలుసా… మీ మంత్రిని నేనే… ప‌నులు మంచిగ జ‌రుగుతున్న‌యా? కూలీ ఎంత గిడుతుంది? స‌రిపోతాందా? అంటూ ప్ర‌శ్నించారు. ఆ సారు మాకు తెలుసు… మీరే మా మంత్రి. మంచిగ‌నే ఉంది సారు అని వాళ్ళు చెప్పారు. మ‌రి ఈ కాలువ ఎంత దూరం ఉంటుంది? అంత దూరం ప‌ని చేస్తున్న‌రా? అని అడిగారు. అవున‌న‌గానే… మంచి ప‌నే పెట్టుకున్న‌రు. ఉప‌యోగ ప‌డే ప‌నులే చేయండి. అని ఉపాధి హామీ కూలీల‌కు సూచించారు.

ఆ వెంట‌నే క‌రోనా ఉన్న‌ది తెలుసా? అని అడిగారు. తెలుస‌న‌గానే, జెర భ‌ద్రంగా ఉండండి. లాక్ డౌన్ పాటిస్తున్న‌రా? అని మంత్రి ఎర్ర‌బెల్లి అడిగారు. పాటిస్తున్నం స‌ర్. దూరం దూరం కూడా ఉంటున్నం అని వారు చెప్పారు. ఇంకా దూరంగా ఉండండి. క‌రోనా పోయే దాకా, సీఎం కెసిఆర్ చెప్పిన‌ట్లు చేద్దాం. లాక్ డౌన్ ని పాటిద్దాం. అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఉపాధి హామీ కూలీల‌కు చెప్పారు.

మంత్రి నేరుగా ఉపాధి హామీ కూలీల‌తో ముచ్చ‌టించ‌డంతో… ఆ కూలీల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పైగా, ఎల్ల‌ప్పుడూ త‌మ‌కు అందుబాటులో ఉండే మంత్రి ద‌య‌న్న‌, మ‌రోసారి త‌మ‌ వ‌ద్ద‌కే రావ‌డం, యోగ క్షేమాలు అడ‌గ‌టంతో ఉపాధి హామీ కూలీలు ఉత్సాహంగా ప‌ని చేస్తున్నారు. మ‌మ‌ మాస్కి మారు పేరైన ద‌య‌న్న… క‌రోనా నేప‌థ్యంలోనూ మాస్, క్లాస్ జ‌నాల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా ఉంటూ, వాళ్ళ‌తో క‌లిసి పోయి, అవ‌గాహ‌న, చైత‌న్య ప‌రుస్తూ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. మ‌రి ద‌యన్నా…! మ‌జాకా?!

ఈ సంద‌ర్భంగా ఉపాధి హామీ ప‌నులు చేస్తున్న కూలీల బిడ్డ‌…ఓ ప‌సి వాడు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి ఎదుర‌య్యాడు. వెంట‌నే ఆ బాబుని ప‌ల‌క‌రిస్తూ… బాబూ! బాగున్న‌వా!? అంటూ ప‌ల‌క‌రించారు. అంతేకాదు. నీ పేరేంటి. బ‌డికిపోతున్న‌వా? అంటూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ప్ర‌తిగా ఆ బాలుడు కూడా రెండు చేతులు జోడించి మంత్రి ద‌య‌న్న‌కి న‌మ‌స్క‌రించాడు. దీంతో అక్క‌డున్న వాళ్ళ క‌ళ్ళు చెమ‌ర్చాయి. మంత్రి త‌గ్గి, వంగి న‌మ‌స్క‌రిస్తే… ప్ర‌తిగా మంత్రితో మాట్లాడుతూ, ఆ బాలుడు కూడా రెండు చేతులా మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాలు ప్ర‌తిబింబించేలా… న‌మ‌స్క‌రించ‌డం అంద‌రినీ ఆక‌ర్షించింది.

- Advertisement -