కరోనా.. వైద్యం అందిస్తున్న మంత్రి కుమారుడు..

363
pujith reddy
- Advertisement -

రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుమారుడు డాక్టర్ వేముల పూజిత్ రెడ్డి కరోనా నేపథ్యంలో కరీంనగర్ లోని ప్రతిమ హాస్పిటల్ లో అత్యవసర విభాగాల్లో రోగులకు సేవలు అందిస్తున్నారు. పూజిత్ రెడ్డి ప్రస్తుతం ప్రతిమ మెడికల్ కాలేజీలో పిజి విద్యను అభ్యసిస్తున్నారు.

vemula pujith

కరోనాకు హాట్ స్పాట్ గా ఉన్న కరీంనగర్‌లో వైద్యసేవలు అందించేందుకు వెళ్తానని కుటుంబ సభ్యులకు చెప్పగా ఆయన తల్లి ఈ పరిస్థితుల్లో వద్దని చెప్పారు.తల్లికి నచ్చజెప్పి, ఆయన నిర్ణయాన్ని తండ్రి మంత్రి ప్రశాంత్ రెడ్డికి చెప్పగా ఈ విపత్కర పరిస్థితుల్లో ఒక వైద్యుడిగా నీ సేవలు సమాజానికి అవసరం. ఈ కష్ట కాలంలో నీవు అందించే సేవల వల్ల నీ వు చదువుకు సార్థకత చేకూరుతుందని తెలిపిన మంత్రి.. తన నిర్ణయాన్ని గౌరవిస్తూ క్లిష్టసమయంలో సేవ చేయాలన్న కుమారుని నిర్ణయాన్ని అభినందించారు.

- Advertisement -