కోవిడ్ – 19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ఈ రోజు పలువురు మంత్రి కేటీఆర్‌ను జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కలిసి తమ విరాళాలకు సంబంధించిన చెక్కులను అందించారు. ఇందులో కావేరీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పది లక్షల రూపాయలను, సమ్ టోటల్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎనిమిది లక్షల రూపాయలను, కోన జనార్దన్ రావు లక్షా యాభై వేల రూపాయలను మంత్రి కేటీఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి అందించారు.
అలాగే ఆవాస కన్‌స్ట్రక్షన్స్,, గణపతి కన్‌స్ట్రక్షన్స్,, నవ్య కన్‌స్ట్రక్షన్స్ తరఫున ఆ సంస్థల ప్రతినిధులు కర్నాటి విద్యాసాగర్, నేవూరి ధర్మేందర్ రెడ్డిలు రెండున్నర లక్షల చొప్పున మొత్తం 7,50,000 రూపాయల విరాళాలను ముఖ్యమంత్రి సహాయనిధి అందించారు.
అదేవిధంగా సీఎం సహాయనిధికి తెలంగాణ మోటార్ వెహికల్ అసోసియేషన్ సభ్యల ఒక నెల గ్రాస్ సాలరీని విరాళంగా ఇస్తూ ఉత్తర్వులు జారీ.అసోసియేషన్ తరుపున కోటిన్నర విరాళాన్ని తమ జీతాల్లో నుంచి ప్రభుత్వానికి అందజేసింది రవాణాశాఖ ఉద్యోగుల అసోసియేషన్.