ప్రజల మనసెరిగిన గొప్ప నాయకుడు కేసీఆర్..

204
gutha
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ని మే 7 తేదీ వరకు పొడిగించడాన్ని ప్రజలు అందరు స్వాగతిస్తున్నారు అని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రజల మనసు ఎరిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు సరైన నిర్ణయాలే తీసుకొంటారు అని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని సడలించేందుకు అవకాశం ఇచ్చిన ప్రజల శ్రేయస్సు కోసం లాక్ డౌన్ ని మే 7 తేదీ వరకు పొడిగించడం జరిగింది అన్నారు. పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులోకి రాకముందే సడలింపు ఇస్తే మళ్ళీ కరోన వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఊహించిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకొన్నారన్నారు.

ప్రజలు అందరు సంపూర్ణంగా లాక్ డౌన్ ని పాటించాలి అన్నారు. చైనా దేశం కరోన పాజిటివ్ కేసుల వారికి చికిత్స కోసం హాస్పిటల్ నిర్మించిన విధంగా దేశంలో ఏ రాష్ట్రం నిర్మించలేని హాస్పిటల్‌ను గచ్చి బౌలి క్రీడా గ్రామంలో నిర్మించిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుంది అన్నారు.ప్రజలు ఎవరు కూడా అధైర్యపడకుండా ప్రభుత్వ సలహాలు,అంచనాలు,ఆదేశాలు పాటిస్తూ కరోనను మన రాష్ట్రం నుండి తరిమి కొట్టాలన్నారు. కరోన వైరస్ నిర్ములన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య, మున్సిపల్, భద్రత సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన తెలిపారు. నిరంతరం కరోన వైరస్‌తో పోరాడుతున్న జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులకు కూడా ధన్యవాదాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -