లాక్ డౌన్ ముగిసేవరకూ పేదల ఆకలి తీరుస్తాం..

145
- Advertisement -

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఉప్పల ఫౌండేషన్ తరపున లాక్ డౌన్ విధించిన నాటి నుండి ప్రతీరోజూ ప్రజలకు భోజనాలు, ఇబ్బందుల్లో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉప్పల్, అంబర్ పేట్, జయపురి కాలనీ, వనస్థలిపురం, బండ్లగూడ, నాగోల్, మనసురా బాడ్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

uppala foundation

లాక్ డౌన్ ముగిసేవరకూ వనస్థలిపురంలోని కరుణ జ్యోతి ట్రస్ట్ కు, నాగోల్ లోని వాత్సల్యం ఆర్గనైజేషన్ కు, మనుసురాబాద్ లోని సద్గురు ఓల్డేజ్ హోంలకు ఆహారం అందిస్తున్నారు. అలాగే నిత్యం 2 వేలమందికి పారిశుద్ధ్య కార్మికులకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, వలస కూలీలకు, జీహెచ్ఎంసీ పరిధిలోని కార్మికులకు, నిరుపేదలకు ఆహారం అందిస్తున్నారు.

లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నామని, 7వ తేదీన లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని ఉప్పల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆరెస్ పార్టీ నాయకులు, ఐవీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -