శ్రీశైలం పేరు చెబితే, తొలుత గుర్తుకు వచ్చేది లక్షలాది వన్యప్రాణుల నెలవుగా నిలిచిన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అభయారణ్యం సువిశాలమైన ప్రకృతి రమణీయ నల్లమల్ల గుర్తుకొస్తుంది, ఆ రోడ్డు వెంట ప్రయాణిస్తే అక్కడి ప్రకృతి అందాలు, వన్యప్రాణుల సయ్యాటలు ఉండే పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతున్నా, వారికి నల్లమలలో నెలకొన్న పచ్చదనం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా శ్రీశైలం మల్లన్న ఆలయంలో దర్శనాలను నిలిపివేసి, భక్తులను నిలువరించడంత, సాధారణంగా అయితే ప్రతిరోజూ ఐదు వందల వాహనాలపై గా శని ఆదివారాల్లో రెండువేల వాహనాలకు పైగా హైదరాబాద్ నుండి శ్రీశైలం రోడ్డుపై ప్రయాణించే వాహనాలు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా రద్దీ అమాంతం తగ్గిపోగా, సువిశాలమైన నల్లమల్ల శ్రీశైలం రోడ్డు బోసిపోయాయి.
సువిశాలమైన నల్లమలలో 20 పెద్ద పులులు, 103 చిరుత పులులు,170 ఎలుగుబంట్లు, 5000 జింకలు కొన్ని వేలకుపైగా అడవి కుక్కలు, అడవి పందులు, కోతులు, దుప్పులు, నెమళ్ళు, అడవి కోళ్ళు ఇతర వివిధ జాతుల జంతువులన్నీ నివాసం ఉంటున్నాయని, వాటికి త్రాగు నీటి కోసం 750 నీటి సాసర్ లు ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీ అధికారి జోజి తెలిపారు. జనసంచారం వాహన లేకపోవడంతో శబ్ద వాయు కాలుష్యం లేకుండా వన్య ప్రాణులు యధేచ్చగా స్వేచ్ఛగా అడవిలో తిరుగుతున్నాయని, వన్యప్రాణులకు ఎలాంటి హానీ జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని సీసీ కెమెరాల ద్వారా వాటిని పర్యవేక్షిస్తున్న మని తెలిపారు. ఏ ఒక్క వ్యక్తిని కూడా అడవిలోకి అనుమతించడం లేదని, కరోనా జంతువులకు సోకకుండా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామన్నారు.
ఆగస్టు మాసం వరకు అడవిలో ఎవరికీ అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అడవిలో సంచరించి నట్లయితే వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తాజాగా, శ్రీశైలం రోడ్ల పై పులులు ఎలుగుబంట్లు సంచరిస్తున్న అడవి ప్రాంతంలో పులి కనిపించింది. ఇక కోతులు, పాముల అడవిలో సంచారం చేస్తూ కెమెరాలతో పర్యవేక్షిస్తూ.. అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. వాహనాల సంచారం పూర్తిగా లేకపోవడంతోనే జంతువులు అడవుల నుంచి బయటకు వస్తున్నాయి, శబ్ద, వాయు కాలుష్యం లేకపోవడంతో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి అని జిల్లా అటవీ అధికారి తెలిపారు. అటవీశాఖ సిబ్బంది అనుక్షణం వన్యప్రాణుల కదలికలపై కన్నేశారని తెలిపారు.