9వ రోజు.. ఎంపీ సంతోష్ అన్నదానం..

189
- Advertisement -

బోయినిపల్లిమండలంకోదురుపాక గ్రామంలో ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం క్యాంప్ 9వ రోజుకు చేరింది. సుమారు 95 మంది వలస కార్మికులు భోజనాలు చేశారు. ఈ క్యాంప్ లాక్‌డౌన్ పూర్తి అయ్యేవరకు భోజనాలు పెడతామని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు విధిగా మస్కులు ధరించాలి అని తెలిపారు.

అన్నదాత సుఖీభవ అన్నారు పెద్దలు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న సంతన్నకి మా కృతజ్ఞతలు అని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చిక్కల సుధాకర్ రావు, టీఆర్‌ఎస్‌ నాకులు ఒద్దెల మహేందర్, బొల్లావేని తిరుపతి, సందుల శ్రీనివాస్, కత్తెరపాక సుధాకర్, ఆకుల కర్ణకర్, సారంపెళ్లి రవి, కమల్, గుండ్ల సాయబు పాల్గొన్నారు.

- Advertisement -