- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. కరోనా ప్రభావంతో ప్రపంచదేశాలన్ని ఆర్ధిక మాంద్యంలోకి కూరుకుపోయాయి. ఇక ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది.
వీరిలో 1,31,340 మంది మృత్యువాతపడ్డారు. కరోనా పాజిటివ్ కేసుల్లో సగానికిపైగా కేసులు ఐరోపా దేశాల్లోనే నమోదయ్యాయి. ఐరోపా దేశాల్లో 10,10,858 మందికి కొవిడ్-19 సోకగా, 85,271 మంది మరణించారు.
ఇక అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. 6 లక్షల 22 వేల 380 కేసులు నమోదు కాగా 27,548 మంది మరణించారు. ప్రస్తుతం రోజుకు సగటున 70 వేల నుంచి 80 వేల కొవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి.
- Advertisement -