కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నతస్ధాయి సమీక్ష..

191
kcr cm
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్,సీఎస్ సోమేష్ కుమార్,డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో పకడ్బందీ వ్యూహాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. లాక్‌డౌన్‌ అమలు తీరుపైనా అడిగి తెలుసుకున్నారు.

లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఈనెల 20వ తేదీ తర్వాత ఇవ్వాల్సిన మినహాయింపులపై అధికారులతో సీఎం సమీక్షిస్తున్నారు.

- Advertisement -