- Advertisement -
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా మల్లయ్య గార్డెన్స్‌లో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణ రావు పేట మండలాలకు చెందిన 700 మంది ఆటో డ్రైవర్లకు, అదే విధంగా సిద్ధిపేటలోని 162 మంది రజకులకు మంత్రి హరీశ్ రావు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పని సరిగా ధరించాలి. రోడ్లపై ఉమ్మి వేయాకూడదన్నారు.
లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బంది నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ తరపున సరుకులు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం,1500 రూపాయల నగదు ఇస్తున్నాం.బ్యాంకులో డిపాజిట్ అయినా డబ్బులను సామాజిక దూరం పాటించి తీసుకోవాలి. బ్యాంకులో ఆగమాగం చేయకూడదు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి.అందరూ ఇండ్లకే పరిమితమై, సమాజాన్ని కాపాడేందుకు కృషి చేయాలి అని మంత్రి హరీష్ అన్నారు.
- Advertisement -