కరోనా ఎఫెక్ట్‌: ఐటీ శాఖ కీలక నిర్ణయం

462
Income Tax Department
- Advertisement -

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఐటీ (ఆదాయపు పన్ను) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు ల‌బ్ది చేకూరేలా పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌లను వెంట‌నే రిలీజ్ చేయాలని నిర్ణయించింది. 5 ల‌క్ష‌లలోపు ఉన్న రిఫండ్‌లను తక్షణమే విడుదల చేయనున్నాట్లు ఐటి శాఖ నిర్ణయం తీసుకుంది.

ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో 14 లక్షల మందికి ఊర‌ట‌ లభించనుంది. జీఎస్టీ, కస్టమ్స్ కేట‌గిరీల‌కు చెందిన దాదాపు మరో లక్ష మంది వ్యాపార వ‌ర్గాల‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌నుంది. ఎంఎస్‌ఎంఈలకు కూడా ఇది వర్తిస్తుంది. మొత్తం రూ.18 వేల కోట్లను రిఫండ్‌ల చెల్లింపుల కోసం రిలీజ్ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొంది. పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. ఈ సమయంలో ఐటీ శాఖ తీసుకున్న నిర్ణయం కంపెనీలకు కొంచెం ఊరట కలిగించే అవకాశంఉన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -