- Advertisement -
దేశంలో కరోనా వైరస్ విజృంభించకుండ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.అయితే ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ కంటిన్యూ చేస్తారా లేదా ఎత్తేస్తారా అనే దానిపై రకరకాల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా భారత్‌లో లాక్ డౌన్ ఆరు అంచెల్లో అమలు జరుగుతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ సమాచారం అసత్యమని…లాక్ డౌన్ తేదీల జాబిత అబద్దమని కొట్టిపారేసింది కేంద్రం.
ఈ సమాచారం అధికారికమైంది కాదని స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అసత్య ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…పుకార్లను నమ్మవద్దని కోరింది కేంద్రం.
- Advertisement -