12 గంటల్లో 302 కొత్త కేసులు..

409
coronavairas
- Advertisement -

క‌రోనా వైరస్‌ ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆరు ల‌క్ష‌ల మందికి పైగా ఈ మ‌హ‌మ్మారి బారినప‌డ్డారు. 60 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా మన దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. 12 గంటల్లో 302 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది.

దీంతో దేశంలో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,374కు చేరిందని తెలిపింది. వారిలో 3,030 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 267 మంది కోలుకున్నారని తెలిపింది. 77 మంది మృతి చెందారని వివరించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 490 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఆ తర్వాత తమిళనాడులో 485 మంది ఉన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య తెలంగాణలో 228,ఏపీలో 226 కేసులు నమోదు అయ్యాయి. అయితే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మ‌న దేశంలో మాత్రం యుక్త వ‌య‌స్కులే ఎక్కువ‌గా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. అయితే మ‌ర‌ణాల్లో మాత్రం వృద్ధుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ది.

- Advertisement -