స్థానికంగా కరోనా వ్యాపించలేదు : మంత్రి ఈటల

241
etela
- Advertisement -

తెలంగాణలో స్ధానికంగా కరోనా వ్యాప్తి చెందలేదని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చిన వారు,వారితో కలిసిన వారు మాత్రమేనని స్పష్టం చేశారు.

మర్కజ్‌ నుంచి 1,090 మంది తెలంగాణకు వచ్చారని, వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని పర్యవేక్షణ కేంద్రాల్లో డాక్టర్లను నియమించామని, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారన్నారు. అన్ని కేంద్రాల్లో ఎన్‌- 95 మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. శుక్రవారం చనిపోయిన ఇద్దరు ఢిల్లీ నుంచి వచ్చినవారితో కలిసిన వారేనని స్పష్టంచేశారు.

వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత తమ బాధ్యత అని, వైద్యులపై దాడిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు రోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సీఎస్‌, వైద్యశాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -