తెలంగాణలో యాక్టివ్ పాజిటివ్ కేసులు 228…

127
corona

తెలంగాణలో శనివారం ఒక్కరోజే 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కేసులు 272కి చేరుకోగా ఇప్పటివరకు 33 మంది కొలుకున్నారు. దీంతో యాక్టివ్ పాజిటివ్ కేసులు 228 ఉండగా ఇప్పటివరకు 11 మంది చనిపోయారు.

పాజిటివ్‌ వ్యక్తులు కలిసినవారిని గుర్తించడంపై సర్వైలెన్స్‌ బృందాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయని వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. మర్కజ్‌ వెళ్లి వచ్చినవారి ద్వారా ఇతరులకు సోకడాన్ని కట్టడి చేయడంతోపాటు పాజిటివ్‌ ్యక్తులను గుర్తించి వారు కలిసిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు తెలిపింది.