దేశమంతా లాక్డౌన్ విధించడంతో సాధారణ ప్రజలతో పాటు అన్ని రంగాల ప్రముఖులు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే కొంతమంది యువకులు లాక్డౌన్ పాటించకుండా ఇండ్ల నుంచి బయటకు వస్తు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటివారికి కనువిప్పు కలిగేలా టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
లాక్ డౌన్ నిబంధన ఉన్నప్పటికీ కూడా తన తల్లి మాటను లెక్కచేయకుండా తనకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉందని చెప్పి నిర్లక్ష్యంతో బయటకు వెళ్లి కరోన వైరస్ ను తన వెంట తీసుకొని వచ్చి తన కుటుంబ సభ్యులకు దానిని అంటించటం వల్ల తన తల్లి ప్రాణాలు కోల్పోయే ఒక సందేశాత్మకమైన వీడియోను రాజ్యసభ సభ్యులు సంతోష్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం అందర్నీ ఆలోచింపజేసింది.
ఈ వీడియో చూసిన నెటిజన్స్ సంతోష్ ఎంతో సందేశాత్మకమైన పోస్ట్ పెట్టారని అభినందించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా నిర్లక్ష్యంగా వ్యవహరించ కుండా ఇంటి వద్దనే ఉండటమే కాకుండా తన కుటుంబసభ్యులు కూడా మంచిగా ఉండే విధంగా వ్యవహరించాలని కోరారు.
No matter how strong you feel your immunity system is.. Someone of your acquaintance’s is not capable of fighting the deadly #COVID2019.
If you step out, you are not only risking your life but making someone’s miserable.
Stay put India 🙏. #StayHome #StaySafe#LockdownTelangana pic.twitter.com/R80dcPnxci— Santosh Kumar J (@MPsantoshtrs) April 3, 2020