భద్రాద్రిలో నిరాడంబరంగా రాములోరి క‌ల్యాణం

315
badradri
- Advertisement -

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భద్రాద్రిలో రాములోరి క‌ల్యాణం నిరాడంబరంగా జరిగింది. తొలసారిగా భక్తులు లేకుండా సీతారామ కల్యాణం జరిగింది. ప్రతి ఏటా మిథిలా స్టేడియంలో లక్షలాది భక్తజనం మధ్య సీతారాముల కల్యాణం నిర్వహించేవారు. కానీ ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములోరి కల్యాణ వేడుక నిర్వహించారు.

కేవలం 40 మంది మాత్రమే హాజరుకాగా ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్.

ఈ కార్యక్రమంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, వేదపండితులు, అర్చకులు, ఆల‌య‌, ఇత‌ర శాఖ‌ల అధికారులు మాత్రమే హాజ‌ర‌య్యారు.

- Advertisement -