కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన వనపర్తి ఎస్పీ..

565
wanaparthy sp
- Advertisement -

వనపర్తి జిల్లాలో ఓ కొడుకు ముందే తండ్రిని చితకబాదిన సంఘటనపై కేటీఆర్ మండిపడిన సంగతి తెలిసిందే.సంబంధిత కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీని కేటీఆర్ ఆదేశించారు.

ఈ నేపథ్యంలో స్పందించారు వనపర్తి ఎస్పీ అపూర్వరావు. సంఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆమె..ప్రజలపై ఇలా ఓ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామని సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని ఎస్పీ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్‌ రెడ్డికి ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

sp

- Advertisement -