లాక్ డౌన్ పాటించండి: సాయి కుమార్

253
saikumar
- Advertisement -

కరోనా వైరస్‌ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు లాక్ డౌన్ తప్పనిసరిగా పాటించాలన్నారు సినీ నటుడు సాయి కుమార్. ఓ వీడియో ద్వారా సందేశం ఇచ్చిన ఆయన కరోనాను అరికట్టేందుకు ప్రబుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పారు.

కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహమే మీరు.. మీరు అంటే మనం.. మనం అంటే దేశం..ద‌య‌చేసి ప్ర‌తి ఒక్క‌రు స్వీయ నియంత్ర‌ణ పాటిస్తూ క‌రోనాని త‌రిమికొట్టండ‌ని పిలుపునిచ్చారు.

క‌రోనా వైర‌స్‌పై ప్ర‌జ‌ల‌ని అప్ర‌మ‌త్తం చేసేందుకు ప్ర‌భుత్వంతో పాటు ఇప్పటికే సెల‌బ్రిటీలు నడుం బిగించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

- Advertisement -