రాములోరి కళ్యాణం….టీవీల్లో వీక్షించండి

293
srirama navami
- Advertisement -

శ్రీరామ నవమి వేడుకలకు భద్రాద్రి సిద్ధమైంది. కరోనా వైరస్ నేపథ్యంలో తొలిసారి భక్తులు లేకుండా శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. అయితే ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించేవారు. కానీ ఈసారి టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి సరిపెట్టుకోవాల్సిందే.

మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నంలో జీలకర్ర, బెల్లం స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలపై ఉంచుతారు. భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో మాంగల్యధారణ కార్యక్రమాన్ని చేస్తారు. అనంతరం ఎర్రని తలంబ్రాలతో వేడుక నిర్వహిస్తారు. శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది.

ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,పువ్వాడ అజయ్ స్వామి వారికి పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. భద్రాచలం శ్రీరామచంద్రస్వామి ఆలయం మొ దలు మారుమూల పల్లెల్లోని దేవాలయాల వర కు కేవలం అన్నిచోట్లా ఆలయ కార్యక్రమంగానే స్వామి కల్యాణాన్ని పరిమితం చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈసారి పానకం, వడపప్పు అందించటం, అన్నసంతర్పణ చేయటాన్ని నిషేధించారు.

- Advertisement -