పోలీస్,వైద్య,పారిశుధ్య సిబ్బందికి పూర్తి జీతాలు…

336
kcr
- Advertisement -

రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో పై స్ధాయి నుండి కింది స్ధాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది జీతాల్లో కోత విధించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిలో స్వల్ప మార్పులు చేస్తూ పోలీస్,పారిశుధ్య,వైద్య సిబ్బందికి పూర్తి స్ధాయిలో జీతాలు చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు.. ఇతర అంశాలపై బుధవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.

కరోనా పోరులో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న వీరికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని ఈ సమావేశంలో వెల్లడించారు సీఎం. అసాధారణ పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని పారదోలడానికి అహరహం శ్రమిస్తున్న వీరి రుణం తీర్చుకోలేనిదైనా.. వీరి సేవలకు గుర్తింపుగా ప్రోత్సాహకాలు సీఎం కేసీఆర్‌ ఒకట్రెండు రోజుల్లో స్వయంగా ప్రకటించనున్నారు.

ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -