కరోనా కట్టడికి మందు కాదు ముందు జాగ్రత్త ముఖ్యం..

383
Telangana Fire Department
- Advertisement -

కరోనా వ్యాధి నివారణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు హైదరాబాద్ ను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది. ప్రతి ప్రాంతంలో శుభ్రత కోసం చర్యలు చేపట్టడంతో పాటు కరోనా వ్యాధి నివారణకు మందు చల్లుతోంది. ఇందుకు అగ్నిమాపక శాఖకు చెందిన ఫైర్ టెండర్లను రంగంలోకి దించింది.

Fire Department

నగరంలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ఈ ఫైర్ ఇంజిన్ల ద్వారా ప్రభుత్వం మందు చల్లిస్తోంది. తద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతోంది. జంటనగరాల్లోని ప్రతి కమ్యూనిటీ అప్రమత్తంగా ఉండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తోంది. కరోనా కట్టడికి మందు కాదు ముందు జాగ్రత్త ముఖ్యం అనే స్లోగన్ తో ప్రభుత్వం పౌరులను అప్రమత్తం చేస్తోంది.

- Advertisement -