రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేయాలని, ప్రజల్లో చైతన్యం పెంచాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు మంత్రుల స్థాయి నుంచి వార్డు సభ్యులదాకా ప్రజాప్రతినిధులందరూ రోడ్లమీదకు వచ్చారు.
పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించారు. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు.
కాలినడకన ఇంటికి బయల్దేరిన వారికి వాహనం ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా ఉందనే భరోసా కల్పించారు కేటీఆర్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కి చెందిన వారు హైదరాబాద్ లో కూలి పని చేయడానికి రాగ, లాక్ డౌన్ తో ఇక్కడే చిక్కుకున్నారు. బుధవారం వారు కాలినడకన ఇంటి బాట పట్టారు. ప్రగతిభవన్ నుంచి బుద్ధభవనానికి వెళ్తున్న మంత్రి కేటీఆర్ వారిని చూసి వాహనాన్ని ఆపి దిగి వారి వద్దకు వెళ్లారు. వివరాలు తెల్సుకుని అక్కడికక్కడే గూడ్సు ఆటోని ఏర్పాటు చేసి వారిని పంపించారు.