కరోనా మోదటి లక్ష మందికి చేరడానికి 67 రోజులు పట్టింది…ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లోనే 3 లక్షలకు చేరిందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. ఈ 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకుంటే మనచేతుల్లో ఏమి ఉండదని..ప్రజలంతా ఒకే పని చేయాలి.. ఇళ్లలోనే ఉండాలన్నారు.
ఈ లాక్డౌన్ నిర్ణయం ప్రతి ఇంటికీ లక్ష్మణరేఖ వంటిదని…వైద్య సదుపాయాల కోసం రూ.15 వేల కోట్లు కేటాయిస్తున్నాని చెప్పారు.రోగ్య సేవలకే తొలి ప్రధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలను కోరుతున్నానని చెప్పిన మోడీ…సంక్షోభ సమయంలో భుజం భుజం కలిపి పనిచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్రాలు నిరంతరం ఇదే విషయంపై ఆలోచిస్తున్నాయని…నిత్యావసరాలన్నీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం అన్నారు.
కేంద్ర, రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు పేదల ఇబ్బందులు పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయని..ప్రజల ప్రాణాలు కాపాడటమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం అన్నారు.ఎలాంటి పుకార్లు, వదంతులు, మూఢనమ్మకాలు నమ్మవద్దన్నారు.
కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చే మార్గదర్శకాలు పాటించాలని..వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోవద్దన్నారు. నిర్లక్ష్య ధోరణితో మందులు తీసుకుంటే మరింత ప్రమాదంలో పడతారని…21 రోజుల లాక్డౌన్.. మన ప్రాణాల కంటే ఎక్కువ కాదన్నారు.
ఎవరూ ఇంటినుంచి బయటకు రాకూడదని..ఈ దేశంలో ఏం జరిగినా ఇళ్లలోనే ఉండాలన్నారు. ప్రధాని నుంచి గ్రామవాసుల వరకు సామాజిక దూరం పాటించాలని…ఏం జరిగినా ఇంటిచుట్టూ ఉన్న లక్ష్మణరేఖ దాటి రావొద్దన్నారు.
కరోనాపై పోరాటానికి మన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయమిదని….ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించాల్సిన సమయమిదన్నారు.