తెలంగాణలోనూ కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్ డౌన్ ప్రకటించింది. రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాలనుండి ఎవరు ప్రవేశించకుండా సరిహద్దులు మూసివేసింది. ఇక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 30 కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
కాగా కరోనా వైరస్ నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ప్రార్థిస్తూ పలు ఆలయా ల్లో హోమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం హో మం నిర్వహించారు. మంగళవారం కాళేశ్వరం దేవాలయం, బాసర జ్ఞానసరస్వతి దేవి ఆలయంలో, గద్వాల జిల్లా జోగులాంబ దేవాలయం, మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గభావాని దేవాలయాల్లో మృత్యుంజయ హోమాలు నిర్వహిస్తారు. శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం నాచారం గజ్వెల్, హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లిలో వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో సుదర్శన హోమం నిర్వహిస్తారు.