ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు ను గౌరవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ లో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కల పెంపకంతో పాటు కూరగాయల సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 24 గంటల జనతా కర్ఫ్యూ ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మంత్రి కోరారు.
కరోనా మహమ్మారి వల్ల దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేసీఆర్ చూపించిన చొరవ మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కరోనా మహమ్మారి కట్టడి కి కృషిచేస్తున్నారు. ప్రజా సంక్షేమం, ఆరోగ్యం , కరోనా నియంత్రణ కోసం ఎన్ని వందల కోట్లు అయిన ఖర్చు పెట్టి ప్రజలను కరోనా వైరస్ నుండి రక్షిస్తారన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు స్వీయ నియంత్రణలో ఉండి తగిన జాగ్రత్తలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ముందు జాగ్రత్తలు పాటిద్దాం..
కరోనా వ్యాప్తిని అరికడదాం.#StaySafe #FightAgainstCorona #BeSelfIsolated #QuarantineYourSelfFromSociety #MaintainSocialDistance #JantaCurfew @KTRTRS @TelanganaCMO @trspartyonline @ntdailyonline @TelanganaToday pic.twitter.com/iKnid6LYTZ
— V Srinivas Goud (@VSrinivasGoud) March 22, 2020