రివ్యూ : పిట్టగోడ

316
Review Pittagoda
- Advertisement -

యువతీయువకులు…. వాళ్ల ఆలోచనలూ, అభిరుచులకు తగ్గట్టుగా తెరకెక్కిన సినిమా. నలుగురు స్నేహితుల ప్రయాణం ఆధారంగా తెరకెక్కిందే పిట్టగోడ. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగింది. దీంతో పాటు టీజర్లతోనే మంచి స్పందన తెచ్చుకున్న ‘పిట్టగోడ’ సినిమాలో ఏదో విషయం ఉందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. విశ్వదేవ్, పునర్నవి భూపాలం జంటగా నూతన దర్శకుడు కేవీ ఆనంద్ తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం..

కథ :

టిప్పు, బిల్డప్‌ వేణు, జ్ఞానేశ్వర్‌, నాగరాజు… గోదావరి ఖనిలో పనీ పాటా లేకుండా తిరిగే బ్యాచ్‌. ఆ వూళ్లొ ఎవరికీ వీళ్లంటే గౌరవం ఉండదు. ఇంట్లో కూడా తిట్లూ చీవాట్లే! వీళ్లేమే ‘పిట్టగోడ’ ఎక్కి కబుర్లు చెప్పుకొంటుంటారు. వీళ్లకు ఆ గోడే ప్రపంచం. తమలోకంలో తాము బతుకుతుంటారు. కానీ ఓ రోజు వాళ్లలోనూ మార్పు వస్తుంది. ఆ మార్పుతో ఏం జరుగుతుంది..? టిప్పు, అతని ముగ్గురు స్నేహితులు ఎందుకు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు..?చివరికి కథ ఏలా సుఖాంతమైందో తెరమీద చూడాల్సిందే..

Review  Pittagoda

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథ, కథనం,నటీనటులు, పాటలు. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే ఈ కథను దర్శకుడు ఆసక్తికరంగా చెప్పిన విధానం చాలా బాగుంది. స్నేహితులు నలుగురూ సహజంగా నటించారు. టిప్పుగా కనిపించిన విశ్వదేవ్‌నే హీరో అనుకోవాలి. కుర్రాడు చూడ్డానికి బాగున్నాడు. ‘ఉయ్యాల జంపాల’లో కనిపించిన పునర్నవి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఫస్టాఫ్ ను ఆరంభం నుండి ఇంటర్వెల్ వరకు సినిమాను నడిపిన తీరు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకున్నాయి.హీరో హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ కూడా కొత్తగా, ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ సెకండాఫ్. సెకండాఫ్‌లో ఓ విలన్‌ని ప్రవేశపెట్టి, పాత్రల మధ్య ఘర్షణ పండించాలని చూశారు. దివ్యకేదో భయంకరమైన ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటుందనుకొంటే.. దాన్ని కూడా తేల్చేశారు. క్లైమాక్స్ ను సాదాసీదాగా ముగించేశాడు. హీరో, హీరోయిన్, అతని స్నేహితులు ఎలాంటి ఇబ్బందీ పడకుండా సింపుల్ గా కష్టాల్లోంచి బయటపడిపోవడం, ప్రయోజకులుగా మారిపోవడం వంటివి ముగింపును బలహీనం చేశాయి.

సాకంకేతిక విభాగం :

సింపుల్ స్టోరీని, రియలిస్టిక్ గా రాసుకుని అలాగే తెరకెక్కించడంలో దర్శకుడు, రచయిత కెవి ఆనంద్ చాలా వరకూ సఫలమయ్యారు. నలుగురు స్నేహితుల స్నేహా బంధాన్ని ఎలివేట్ చేసే సీన్లు ఎమోషనల్ గా కనెక్టయ్యాయి. అవసరమైన చోట మాత్రమే వచ్చే పాటలు, వాటికి ప్రాణం కమలాకర్ అందించిన సంగీతం బాగున్నాయి. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ చూడటానికి చాలా బాగుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Review  Pittagoda

తీర్పు :

వాస్తవికతకు దగ్గరగా ఉండే సింపుల్ కథ పిట్టగోడ. కథ, ఆసక్తికరంగా సాగిపోయే ఫస్టాఫ్,లవ్ ట్రాక్,మ్యూజిక్‌ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా….సాదా సీదా క్లైమాక్స్ సినిమాకు మైనస్ పాయింట్స్. మొత్తంగా పిట్టగోడ ఇంకాస్త గట్టిగా కట్టి ఉంటే బాగుండేది.

విడుదల తేదీ : 24/12/ 2016
రేటింగ్ : 3/5
నటీనటులు : విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం
సంగీతం : ప్రాణం కమలాకర్
నిర్మాత : రామ్మోహన్. పి
దర్శకత్వం : కేవీ అనుదీప్

- Advertisement -