కవితమ్మను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం

370
Vemula Prashanth Reddy Kavitha.jpeg
- Advertisement -

నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కల్వకుంట్ల కవితను నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

ఈసందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 9మంది ఎమ్మెల్యేల కోరిక మేరకు కల్వకుంట్ల కవిత పేరు ని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా కృషి చేస్తామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 824 స్ధానిక సంస్ధల ఓట్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 532ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి చెందినవే అన్నారు. 140 కాంగ్రెస్ , 85ఓట్లు బీజేపీ ఉన్నట్లు తెలిపారు. కవిత గెలుపు లాంఛనమే అన్నారు.

- Advertisement -