కరోనా నేపథ్యంలో తెరచి ఉంచిన పలు విద్య సంస్థలు, పబ్బులు, ఇతర సంస్థలపై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్ మెంట్ విభాగం దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా నగరంలోని తెరచి ఉంచిన 66 సంస్థలను అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ మాట్లాడుతూ..జిహెచ్‌ఎంసి పరిధిలో 18 బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్నాం. విద్యాసంస్థలను, కోచింగ్ సెంటర్లను, స్కూల్స్ ను జిమ్నాజియంలను, బార్లు, పబ్‌లు, ఫంక్షన్ హాళ్లు, స్టడీ రూంలు, స్పోర్ట్స్ క్లబ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేయాలి ఆదేశించారు.
అలాగే ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన సంస్థల్లో యాజమాన్యాలు కరోనా నివారణ చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులకు మాస్కులు, హ్యాండ్ గ్లవూసులు, సానిటైజార్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు ఎక్కువగా ఉండే షాపింగ్ మాల్స్, మార్కెట్స్, వాణిజ్య సంస్థల వద్ద కోవిద్-19 నివారణకు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జన సాంద్రత ప్రదేశాలలో కోవిద్-19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డిస్‌ప్లే చేయాలి సందర్శకులకు తప్పనిసరిగా ఎంట్రెన్స్ వద్దనే హ్యాండ్ శానిటైజర్ అందించాలి. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.