ద్రవ వ్యర్థ పదార్ధాల నిర్వహణకు చర్యలు..

256
kotha prabhakar reddy
- Advertisement -

స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా తెలంగాణలో 1,126 గ్రామ పంచాయతీలలో ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. లోక్ సభలో గ్రామీణ ప్రాంతాల్లో ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణను పెంచడానికి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ స్వచ్ఛ భారత్ మిషన్ అంతర్భాగాలలో ఒకటన్నారు. ఇప్పటి వరకు గ్రామాల బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్) హోదా పొందడంపై కేంద్రం దృష్టి సారించిందన్నారు.

ప్రస్తుతం ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ పై దృష్టి కేంద్రీకరించామని…2020-21 నుండి 2024-25 వరకు అమలు చేయడానికి స్వచ్ఛ భారత్ మిషన్ రెండవ దశను ప్రభుత్వం ఇటీవల ఆమోదించిందని తెలిపారు.

- Advertisement -