సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం..

285
kcr assembly
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా ఏకగ్రీవ అమోదం తెలిపింది. సీఏఏపై మొక్కుబడిగా తీర్మానం చేయలేదని దేశవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. కలిసివచ్చే పార్టీలతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు.

సీఏఏ చట్టం దేశవ్యాప్తంగా అనుమానాలకు, ఆందోళనలకు తావిస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. లౌకిక, ప్రజాస్వామ్యవాదులు సీఏఏపై తమ తమ పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. సీఏఏ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని సూచించారు.

స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్నామని.. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పున:సమీక్ష చేసుకోవాలన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ అంశంపై మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు.

- Advertisement -