విదేశీ ప్రయాణికుల పట్ల అప్రమత్తమైన ప్రభుత్వం

304
corona
- Advertisement -

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇండియాలో కూడా ఈ వ్యాధి సోకినవారి సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక తెలంగాణలో ఈనెల 31 వరకు విద్యాసంస్ధలు, థియేటర్లు, పార్క్ లను మూసివేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ప్రత్యేక చర్యలకు సిద్దమైంది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ.

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న 7దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారoటైన్ గైడ్ లైన్స్ జారీ చేసింది. చైనా, ఇరాన్, ఇటలీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కరోనా లక్షణాలతో ఉన్న ప్రయాణికులను ట్రీట్మెంట్ కోసం ఐసోలేటెడ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. 60ఏళ్ళు పై బడిన ప్రయాణికులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారoటైన్ సెంటర్ లకు పంపిస్తున్నారు.

- Advertisement -